20న బిజినేములలో.. జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు
1 min readపల్లెవెలుగు. నందికొట్కూరు:శ్రీ కాశీ చంద్రమౌళీశ్వర స్వామి తిరుణాల ఉత్సవాలను పురస్కరించుకుని నంద్యాల జిల్లా నందికొట్కూరు మండలంలోని బిజినేముల గ్రామంలో జిల్లా స్థాయి పురుషుల కబడ్డీ పోటీలు సోమవారం ప్రారంభం కానున్నాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల క్రీడాకారులు పాల్గొంటున్నారని గ్రామ సర్పంచి రవియాదవ్ , నిర్వాహకులు ఆలయ కమిటీ సభ్యులు జీవి కిరణ్ రెడ్డి ,మధు యాదవ్ తెలిపారు. కబడ్డీ పోటీలకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. పురుషుల కబడ్డీ పోటీలలో ప్రధమ బహుమతి రూ,30,000, రెండవ బహుమతి రూ, 20,000, మూడవ బహుమతి రూ,10,000, నాల్గువ బహుమతి రూ, 6,000, ఐదవ బహుమతి రూ,4,000, ఆరవ బహుమతి రూ.2,000 అందజేయడం జరుగుతుందన్నారు. నందికొట్కూరు వైసీపీ సమన్వయ కర్త, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి సహకారంతో కబడ్డీ పోటీలు ప్రారంభం కానున్నాయని తెలిపారు.కబడ్డీ పోటీలలో పాల్గొను వారు 20 వ తారీఖు సోమవారం ఉదయం 10 లోపు ఎంట్రీ ఫీజ్ రూ.200 చెల్లించి జట్టు పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.అలాగే అంతరాష్ట్ర ఎద్దులు బండలాగుడు పోటీలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారని తెలిపారు. పోటీలలో గెలుపొందిన విజేతలకు సిద్దార్థ రెడ్డి చేతుల మీద బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు. పోటీలలో పాల్గొను క్రీడాకారులకు ఉచిత భోజన వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు జీవి కిరణ్ రెడ్డి, మధు యాదవ్, వైసీపీ నాయకులు సురేష్, గ్రామస్తులు రమణ గౌడు, అమర్ నాథ్ ,పరమేష్, యాకూబ్ బాష, లోకేష్, బోరు బాష, ఈడిగా మద్దిలేటి, శంకర్ గౌడు, బాలకృష్ణ, పాల శ్రీరాములు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.