కాబూల్ రక్తసిక్తం.. 72 మంది దుర్మరణం
1 min read
పల్లె వెలుగు వెబ్ : ఆప్ఘానిస్థాన్ రాజధాని రక్తమోడింది. క్షతగాత్రుల రోదనతో కాబూల్ కలవరపడింది. ఆత్మాహుతి దాడులతో దద్దరిల్లింది. గురువారం సాయంత్రం హమీద్ కర్జాయ్ విమానాశ్రయం వెలుపల జంటపేళ్లులు సంభవించాయి. ఈ ఘటనలో 72 మంది దుర్మరణం చెందారు. మరో 143 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో 12 మంది అమెరికా రక్షణ సిబ్బంది ఉన్నారు. ఇది కచ్చితంగా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పనేనని పెంటగాన్ వెల్లడించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుళ్ల తీవ్రతకు కొందరి శరీరాలు తునాతునకలయ్యాయి. గాయపడిన వారు రక్తమోడుతూ హాహాకారలు చేస్తున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ దాడులను తాలిబన్ లు ఖండించడం విశేషం.