కడప సబ్జైలు ఖైదీ…కర్నూలు జీజీహెచ్లో మృతి
1 min read15 రోజులుగా చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి
పల్లెవెలుగు వెబ్: కడప సబ్జైలు ఖైదీ.. కర్నూలు సర్వజన ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లా వెలుగోడు మండల కేంద్రానికి చెందిన మాజీ సర్పంచ్ తెలుగు రామాంజనేయులు (56) ఓ మర్డర్ కేసులో ఆరేళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. బీపీ, షుగర్ వల్ల గత నెల రోజులుగా కడప ప్రభుత్వలో చికిత్సపొందాడు. ఆరోగ్యం కుదట పడకపోవడంతో రామాంజనేయులును సబ్జైలు అధికారులు కర్నూలు సర్వజన ఆస్పత్రికి తరలించారు. ఇక్కడ కొన్ని రోజులుగా చికిత్సపొందుతున్నాడు. కోలుకోలేక మంగళవారం మృతి చెందినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. అయితే రామాంజనేయులు గతంలో హార్ట్కు స్టంట్ వేసుకున్నాడని వైద్యులు పేర్కొన్నారు. కాగా కడప సబ్జైలు అధికారులు రామాంజనేయులుకు త్వరగా వైద్య చికిత్సలు చేయించడంలో విఫలమయ్యారని, అందుకే మృతి చెందాడని మృతుడి బంధువులు ఆరోపించారు.