NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కడప యువతి కథ విషాదాంతం !

1 min read

పల్లెవెలుగువెబ్ : కడప జిల్లాలో నాలుగు రోజుల క్రితం కళాశాలకు వెళ్లి అదృశ్యమైన యువతి కథ విషాదాంతమైంది. తాజాగా ఆమె మృతదేహం అనుమానాస్పద స్థితిలో బయటపడింది. పోలీసుల కథనం ప్రకారం.. జిల్లాలోని బి.కొండూరు మండలం మరాటిపల్లెకు చెందిన అల్లంపాటి రామిరెడ్డి, రమాదేవి దంపతుల రెండో కుమార్తె అనూష (19) బద్వేలులోని ప్రైవేటు కళాశాలలో డిగ్రీ సెకండియర్ చదువుతోంది. ఈ నెల 20న కళాశాలకు వెళ్లిన అనూష రాత్రయినా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో బద్వేలు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. నిన్న ఉదయం 9 గంటల సమయంలో సిద్ధవటం సమీపంలోని జంగాలపల్లె ఇసుక రీచ్ వద్ద అనూష మృతదేహం అనుమానాస్పద స్థితిలో కనిపించింది. ఆమెపై సామూహిక అత్యాచారం చేసి ఆపై చంపేసి నదిలో విసిరేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ వాదనను పోలీసులు కొట్టిపడేశారు. అదృశ్యమైన రోజే ఆమె ఆత్మహత్య చేసుకుందని గత రాత్రి 10 గంటల సమయంలో మైదుకూరు డీఎస్పీ వెల్లడించారు.

About Author