‘కైయాన్ యోగా’ కళ.. అద్బుతం..
1 min readపల్లెవెలుగు వెబ్, ప్యాపిలి : కర్నూలు జిల్లా ప్యాపిలి మండల పరిధిలోని వెంగళాంపల్లె గ్రామనికి చెందిన బండి మదుక్రిష్ణ అనే చిత్రకారుడు కైయాన్ యోగా లోగోను అత్యద్బుతంగా రూపొందించాడు. 45 నిమిషాలు వ్యవధిలో 1మి.మీ. వెడెల్పు, 2 మి.మీ. పొడవుతో లోగోను తయారు చేశాడు. ఈ సందర్భంగా కళాకారుడు మధుకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ యోగా దినోత్సవంను పురస్కరించుకుని కైయాన్ యోగా లోగోను తయారు చేశానని పేర్కొన్నాడు. యోగాతో మానసిక ప్రశాంతత లభిస్తుందని, ఒత్తిడి తగ్గుతుందని.. యోగా ప్రాధాన్యత అంశాలను పేర్కొన్నాడు. ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఆయన కోరారు.