PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రా ఏజెంట్‌గా కాజల్‌

1 min read

సినిమా డెస్క్​: డిఫరెంట్‌ పాత్రలను ఎంచుకునే టాలీవుడ్‌ చందమామ ఇప్పుడో కొత్త అవతారం ఎత్తనుంది. టాలెంటెడ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా ఓ సినిమా తెరకెక్కబోతోంది. కాగా కాజల్ ఈ మూవీలో ‘రా ఆఫీసర్’గా నటిస్తోంది. నాగార్జున ఎక్స్ రా-ఏజెంట్ గా కనిపిస్తాడు. నాగార్జునకు పూర్తిస్థాయిలో సహకారం అందించే పాత్రలో కాజల్ అగర్వాల్ పాత్ర ఉంటుందట. అలాగే ఈ సినిమాలో కీలక సన్నివేశాల్లో ఆమె ఒక ప్రొసిట్యూట్‌గా కనిపించనుందట. తీవ్రవాదులను ఆకుట్టుకునే నేపథ్యంలో వారి రహస్యాలను తెలుకోడానికి అలా నటిస్తూ వారి రహస్యాలను డిపార్ట్‌మెంట్‌కి చేరవేసే పాత్ర కాజల్ ది అని తెలుస్తోంది. సినిమా మొత్తం ఫుల్ యాక్షన్ ఎంటర్‌‌టైనర్‌‌గా ఉంటుందట. కాజల్ యాక్షన్ సీన్స్‌కోసం ప్రాక్టీస్‌ చేస్తోందట. మొత్తానికి స్పై సీన్స్, వేశ్య సీన్స్ ఇలా రెండు రకాల సీన్స్ తో మెప్పించనున్న కాజల్ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందట.

About Author