NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాళీమాత‌.. మాంసం తినే, మ‌ద్యం తాగే దేవ‌త !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కాళీమాతను అవమా నిస్తూ విదేశంలో ఒక డాక్యుమెంటరీ పోస్టర్‌ వెలిసిన వివాదం ముదిరిన వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా ఎంపీ మహువా మొయిత్రా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ‘నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్‌ స్వీకరించే వ్యక్తి’ అని మంగళవారం కోల్‌కతాలో ఇండియాటుడే సదస్సులో వ్యాఖ్యానించారు. ‘సిక్కింలో కాళీమాతకు విస్కీని కానుకగా సమర్పిస్తారు. అదే యూపీలో ఇది తీవ్రమైన దైవదూషణ. అదే బెంగాల్‌లోని బీర్భూమ్‌ జిల్లాలో కాళీమాతను ఆరాధించే తారాపీఠ్‌ శక్తిపీఠం వద్ద సాధువులు ఎప్పుడూ ధూమపానం చేస్తూ కనిపిస్తారు. నా దృష్టిలో కాళీ మాత మాంసం తినే, ఆల్కహాల్‌ స్వీకరించే వ్యక్తి. నాతో సహా ప్రతి ఒక్కరికీ నచ్చిన దైవాన్ని నచ్చినట్లు ఆరాధించే హక్కుంది’ అని మొయి త్రా అన్నారు. మొయిత్రా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్‌ అధికార టీఎంసీ అభి ప్రాయంగా భావించాలేమో అంటూ బీజేపీ విమర్శలు గుప్పించింది. మొయి త్రా వ్యాఖ్యలతో పార్టీకి ఎలాంటి సంబంధంలేదని టీఎంసీ తర్వాత ట్వీట్‌చేసింది.

                               

About Author