కల్లూర్ సబ్ రిజిస్ట్రార్ అరుణ్ కుమార్ అరెస్ట్
1 min readపల్లెవెలుగు, వెబ్ కల్లూరు అర్బన్ : 27-04-2022 మరియు 28-04-2022 వ తేదీలలో కల్లూర్ సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయం పై ACB అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీ లలో అనధికారిక మొత్తం రూ.59,300/- స్వాధీనం చేసుకోవడం జరిగినది. తనిఖీ సమయంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ పనులపై వచ్చిన వారిని విచారించి వారి వాంగ్మూలం నమోదు చేయడం జరిగింది. తదుపరి దర్యాప్తు లో సేకరించిన సాక్షం ను బట్టి స్వాధీనం చేసుకున్న అనధికారిక నగదు రూ.59,300/- ఆ రోజు రిజిస్ట్రేషన్ కు వచ్చిన వారితోను మరియు ఇతర పనుల గురించి వచ్చిన వారితోను కల్లూర్ సబ్ రిజిస్ట్రార్ శ్రీ P. అరుణ్ కుమార్ మరియు కార్యాలయ సిబ్బంది. వసూలు చేసిన లంచం డబ్బులుగా నిర్ధారణ అయినది. దాని మేరకు ఆ ఆకస్మిక తనిఖీ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు లో P. అరుణ్ కుమార్ వివిధి రకాల పనులపై సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు వచ్చే వారితో లంచం డిమాండ్ చేసి తీసుకున్నాడు అని బలమైన సాక్ష్యాధారాలు లభించడం తో ఈ దినం అనగా 07-11 2022 వ తేది ఉదయం సబ్ రిజిస్ట్రార్, అరుణ్ కుమార్ ను అరెస్ట్ చేసి ACB, కోర్ట్ నందు హాజరుపరచగా జడ్జి గారు అతనిని 21-11-2022 వ తేది వరకు రిమాండ్ కు ఆదేశించడం జరిగింది. ఈ కేసు లో ఆకస్మిక తనిఖీ సమయంలో కల్లూర్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం లో హాజరుగా వున్న ఇతర సిబ్బంది పై కూడా దర్యాప్తు కొనసాగుతుంది అని కర్నూల్ అవినీతి నిరోధక శాఖ, DSP, J. శివ నారాయణ స్వామి పత్రికా ప్రకటన జారీ చేయడం జరిగింది.