ముస్తాబవుతున్న కాల్వ బుగ్గ దేవస్థానం..
1 min read
1న ఎద్దుల పోటీలను ప్రారంభించనున్న ఎమ్మెల్యే చరితా రెడ్డి..
ఓర్వకల్లు (మిడుతూరు) న్యూస్ నేడు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ బుగ్గ శ్రీ భ్రమరాంభ బుగ్గరామేశ్వర స్వామి దేవస్థానం ముస్తాబు అవుతోంది.ఈనెల 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు రథోత్సవ కార్యక్రమం జరగనుంది.ఈ రథోత్సవానికి వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో వస్తున్న సంగతి తెలిసిందే. దేవాలయాన్ని నూతన రంగులతో అలంకరించారు. రథోత్సవాన్ని హంగులతో తీర్చి దిద్దుతున్నారు.రకరకాల అంగళ్లు,ఉయ్యాలలు, చిన్నపిల్లలకు తగిన రీతిలో వారు ఆడుకొనుటకు గాను వస్తువులను ఏర్పాటు చేస్తున్నారు.అంతే కాకుండా రకరకాల బల్బులతో ఈ సంవత్సరం నూతనంగా చాలా పొడవుగానున్న బల్బుల బోర్డును ప్రత్యేక ఆకర్షణగా ఏర్పాటు చేస్తున్నారు.పలు రకాల ఆటల పోటీలు,భజన పోటీలు నిర్వహిస్తున్నారు. మార్చి 1న ఉదయం 8 గం.కు రాష్ట్రస్థాయి ఎద్దుల పోటీల ప్రారంభోత్సవానికి పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి, గౌరు వెంకటరెడ్డి రానున్నారు. మొదటి బహుమతి లక్ష, రెండవది 80వేలు,మూడవది 60,నాలుగవది 40,5 వ బహుమతి 20 వేలు,ఆరవ బహుమతి 10 వేలు,ఏడవ బహుమతి 6 వేలు,8వ బహుమతి 5 వేలు నిర్వహిస్తున్నట్లు అదే విధంగా రెండవ తేదీ న్యూ క్యాటగిరి సైజు బండలాగు పోటీలు ఉదయం ప్రారంభం అగును.వీటిలో 8 బహుమతులు ఉన్నాయని కమిటీ నిర్వాహకులు తెలిపారు.ఈ పోటీలు నంద్యాల జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు టీటీడీ పాలక మండలి సభ్యులు మల్లెల రాజశేఖర్ ఆధ్వర్యంలో జరగనున్నాయి.