PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అవినీతికి అడ్డాగా క‌ళ్యాణ‌దుర్గం మున్సిప‌ల్ కార్యాల‌యం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌ళ్యాణ‌దుర్గం మున్సిపల్ కార్యాల‌యం అవినీతికి అడ్డాగా మారింది. చేతులు త‌డిపితే కానీ అక్క‌డ ఫైళ్లు ముందుకు క‌ద‌ల‌వు. జ‌న‌న‌, మ‌ర‌ణ ధృవ‌ప‌త్రాలు మంజూరు కావు. ఒక్కో ధృవ‌ప‌త్రానికి రూ. 500 నుంచి రూ. 1000 రూపాయ‌లు ఇవ్వాల్సిందే. లేదంటూ స‌ర్టిఫికెట్ల మంజూరులో తీవ్ర ఆల‌స్యం చేస్తారు. మున్సిప‌ల్ కార్యాల‌యం చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేలా చేస్తారు. మున్సిప‌ల్ కార్యాల‌యంలోని కొంద‌రు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మాత్ర‌మే లంచం ఇస్తే కానీ.. మంచం దిగ‌ము అన్న చందంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. వీరి వ్య‌వ‌హార శైలి ప‌ట్ల విసిగి వేసారి పోయిన బాధితులు ద‌ళిత సంఘాల అండ‌తో తిర‌గ‌బ‌డ్డారు. అవినీతి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల భ‌ర‌తం ప‌ట్టారు. చొక్కా ప‌ట్టుకుని ఈడ్చుకొచ్చారు. మున్సిపల్‌ కార్యాలయంలో రామిరెడ్డి అనే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగి ఉన్నాడు. జనన, మరణ ధ్రువీకరణ పత్రాల జారీకి డబ్బులు వసూలు చేస్తున్నాడని ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. శానిటరీ ఇనస్పెక్టర్‌ హరిప్రసాద్‌ అండతో రోజూ వేలాది రూపాయలు వసూలు చేస్తున్నాడని, అయినా సర్టిఫికెట్లు ఇవ్వకుండా నెలల తరబడి తిప్పుకుంటున్నారని బాధితులు వాపోతున్నారు.

ద‌ళిత సంఘాల జోక్యం..
జనన, మరణ ధ్రువీకరణ పత్రాల మంజూరులో అధికారులు తీవ్రజాప్యం చేస్తున్నారని పలువురు బాధితులు దళిత సంఘాల నాయకులను ఆశ్రయించారు. ఈ క్రమంలో మున్సిపల్‌ కార్యాలయానికి బుధవారం వారు వచ్చారు. కమిషనర్‌ వెంకటేశులు చాంబర్‌లో అవినీతిపై నిలదీశారు. రామిరెడ్డి అవినీతికి పాల్పడుతూ ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం మండలం టి.వీరాపురం, పూలకుంట, 75 వీరాపురం గ్రామాలకుచెందిన తిప్పేస్వామి, లింగన్న, రామకృష్ణ, శెట్టూరు మండలం చింతర్లపల్లికి చెందిన మంజు, వైఎనఎ్‌స కోట గ్రామస్థుడు మధు, నీలంపల్లి బాబు తదితరులు తమకు నెల రోజులుగా సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని అధికారులను నిలదీశారు. ఒక్కొక్కరు రూ.500 నుంచి రూ.1000 వరకు లంచం ఇచ్చామని కమిషనర్‌కు తెలిపారు.

అధికార పార్టీ అండ ..
కౌన్సిలర్‌ ప్రభావతికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి రామిరెడ్డి తమ్ముడు. గొడవ నేపథ్యంలో ఆమె తన భర్త శ్రీకాంతరెడ్డితో కలిసి కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా ఉన్నింది. ఇరువర్గాలు అక్కడికి చేరడంతో అదుపు తప్పింది. తీవ్ర ఆగ్రహానికి లోనైన బాధితులు, దళిత సంఘం నాయకుడు గూబనపల్లి నాగరాజు తదితరులు రామిరెడ్డి వ్యవహారశైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో రామిరెడ్డి, ప్రభావతి, శ్రీకాంతరెడ్డితో తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటు చేసుకుంది. పరిస్థితి అదుపుతప్పింది. దళిత నాయకులు రామిరెడ్డిని చొక్కాపట్టుకుని కమిషనర్‌ చాంబర్‌ నుంచి బయటకు లాకొచ్చారు. లంచం తీసుకుని కూడా సర్టిఫికెట్లు ఎందుకు ఇవ్వడంలేదని నిలదీశారు.

                               

About Author