కనువిందుగా శ్రీగోదా రంగనాథ స్వామి కళ్యాణోత్సవం
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు గోదాగోకులంలో వెలసిన శ్రీ గోదా రంగనాథ స్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవం భోగి సందర్భంగా కనుల పండుగగా సాగింది. శ్రీశ్రీశ్రీ త్రిదండి అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ వారి ప్రత్యేక్ష పర్యవేక్షణలో ఆగమ పండితులు రమేశ్ బట్టర్, కిరణ్ బట్టర్ బృందంచే అత్యంత వైభవంగా కడు మనోహరంగా కళ్యాణ క్రతువు సాగింది. ధనుర్మాస వ్రత ఫలముచే శ్రీరంగనాథుడినే వివాహం చేసుకునే యోగ్యత సాధించిన గోదాదేవి భక్తలోకానికి ఆదర్శమని అష్టాక్షరీ సంపత్కుమార రామానుజ జీయర్ స్వామీజీ అన్నారు. ప్రయాగరాజ్ నుండి వచ్చిన శ్రీశ్రీశ్రీ రాఘవ ప్రపన్న జీయర్ స్వామీజీ పాటు జిల్లా న్యాయమూర్తి నేరెళ్ళ శ్రీనివాసులు హాజరయ్యారు. శ్రీశారదా సంగీత నృత్య కళాశాల విద్యార్థులచే సంగీత విభావరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గోదాగోకులం వ్యవస్థాపక అధ్యక్షులు మారం నాగరాజు గుప్త, ట్రస్టీ పల్లెర్ల నాగరాజుతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. భక్తులందరికీ మహాప్రసాద వితరణ చేశారు.