శ్రీరామాపురంలో వైభవోపేతంగా కామద ఏకాదశి
1 min readపల్లెవెలుగు వెబ్ కమలాపురం: శ్రీ రామాపురం పుణ్యక్షేత్రంలో కామద ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం. భూమిలో ఎక్కడలేని విధంగా హరిహరాదులు ఇద్దరు ఒకే వేదికపై నిత్య కళ్యాణం జరుపుకుంటున్న కమలాపురం మండలం శ్రీరామపురం మహా పుణ్యక్షేత్రంలో శుక్ల ఏకాదశి శనివారం నాడు ఉత్తర ద్వార ప్రవేశం చేసి శ్రీ మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వారిని , శ్రీవల్లి దేవసేన దికంద్ర సుబ్రమణ్య స్వామి వారిని, శ్రీ సంజీవిని మౌలిక సహిత వీరాంజనేయ స్వామి వారిని దర్శించుకుంటే భక్తులకు మహాభాగ్యం కలుగుతుంది. ప్రతి శుక్ల ఏకాదశి సాయంత్రం గరుడ వాహనంపై మహా శ్రీ మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామి వారిని మాడవీధులలో ఉత్సవం నిర్వహించడం ప్రత్యేక విశేషం.