PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఫ‌స్ట్ ఇండియ‌న్ గా క‌మ‌ల్ హాస‌న్ సంచ‌ల‌నం !

1 min read

పల్లెవెలుగు వెబ్​: ప్రముఖ విల‌క్షణ న‌టుడు క‌మ‌ల్ హాస‌న్ డిజిటల్ అవతార్‌ కోసం ఎన్‌ఎఫ్‌టీ ప్లాట్‌ఫారమ్ ఫాంటికోతో జత కలిసారు. తన సూపర్‌ కలెక్షన్‌లతో నాన్-ఫంజిబుల్ టోకెన్స్ (ఎన్ఎఫ్టీ)లాంచ్‌ చేయబోతున్నట్టు వెల్లడించారు. అంతేకాదు వర్చువల్ రియాలిటీ స్పేస్‌లో తన సొంత డిజిటల్ అవతార్‌తో మెటావర్స్‌లోకి అడుగిడుతున్న తొలి భారతీయ సెలబ్రిటీగా కమల్‌ అవతరించనున్నారు. బాలీవుడ్‌ బిగ్‌బీ ఇటీవ‌ల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఆర్జించిన నేపథ్యంలో కమల్‌ కూడా సరికొత్త ట్రెండ్‌తో సంచలనం సృష్టిస్తోన్న ఎన్‌ఎఫ్‌టీల వేలంలోకి ఎంట్రీ ఇస్తుండటం విశేషం. పాపులర్‌ మెటావర్స్‌గా డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగు పెట్టడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కమల్‌ వెల్లడించారు.

About Author