PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కమలాపురం ప్రజానాయకుడు కాశీబట్ల సత్య సాయినాథశర్మ దాతృత్వం 

1 min read

పెండ్లిమర్రి మండలం,నాగాయపల్లి శివాలయం (నీరుకోన) కు వెళ్ళే రోడ్డుకు సొంత ఖర్చులతో మరమ్మత్తులు.*48 గంటల్లో రెండు కిలోమీటర్ల రోడ్డునిర్మాణం పూర్తి చేసి ఆదర్శంగా నిలిచిన సాయినాథ్ శర్మ అభిమానులు  

పల్లెవెలుగు వెబ్ కమలాపురం:  కమలాపురం  నాయకుడంటే పదిమందికి ఆదర్శంగా నిలిచి వారి మన్నను పొందడం పరిపాటిగా ఉంటుంది. ఇందుకు నిదర్శనం కమలాపురం నియోజకవర్గ ప్రజాసేవకుడు నాయకుడు పుణ్యభూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి సాయినాథ్ శర్మ ఆయన అభిమానుల ద్వారా నిర్వహింపజేసిన అభివృద్ధి నాయక గణానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. తమ స్వార్థం కోసం ప్రజలను వాడుకోవడమే కాదు గ్రామాల్లో ఇబ్బందులను గుర్తించి ప్రజలకు అవసరమైన సేవలు చేయడం నాయకుడి బాధ్యత అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలో ఉన్న నాయకులకు సాయినాథ శర్మతో పాటు ఆయన అభిమానులు ప్రత్యక్షంగా తెలియజేయడం నియోజకవర్గం ప్రజల ప్రశంసలు అందుకొంటోంది.

 **పెండ్లిమర్రి మండలం, నాగాయపల్లె గ్రామం వద్ద గల నీరుకొన శివాలయం కు వెళ్ళే రహదారి గత కొన్నేళ్లుగా గుంతలతో ,కంప చెట్లు పెరిగి, మరమ్మత్తులు చెయ్యక పోవటం వల్ల కంప చెట్లను తొలగించకపోవడం తో ,శివాలయం లోని* *శివుడిని దర్శించుకోవటానికి వెళ్ళే భక్తులకు తీవ్ర ఇబ్బందులు పడేవారు.ఈ పరిస్థితిని గమనించిన సాయినాథ్ శర్మ అభిమానులు నాగాయపల్లి మాధవ రెడ్డి,మరియు రాళ్లపల్లి బాలకృష్ణ రెడ్డి ,నీరుకోన శివాలయం పూజారి బాబా (గురుస్వామి)తో మాట్లాడగా, వారు కొన్నేళ్లుగా భక్తులు పడుతున్న ఇబ్బందులను వివరించారు. ఈ రోడ్డు యొక్క దుస్థితి విషయాన్నీ సాయినాథ్ శర్మ గారి దృష్టికి ఆయన అభిమానులు తీసుకెళ్ళగా, సాయినాథశర్మ తక్షణమే స్పందించి* శివాలయం కు వెళ్ళే రోడ్డు ను మరమ్మత్తులు చేసి భక్తుల ఇబ్బందులను తీర్చాలని నాగాయపల్లే మాధవరెడ్డి కి రాళ్ళపల్లి బాలకృష్ణ రెడ్డి కి సూచించారు.ఈ మేరకు వారు ఆలయ పూజారి బాబా (గురుస్వామి) గారితో కలిసి వెంటనే ప్రణాళికా వేసారు అప్పటికప్పుడు టిప్పర్లతో గ్రావెల్ ను మట్టిని తోలారు దాదాపు రెండు కిలోమీటర్లు మేర రస్తా వేయడానికి సంకల్పం చేసి బుధవారం ఉదయం నుంచి బాగా కష్టపడ్డారు టి ప్పర్లు ట్రాక్టర్లు మట్టి తీసే యంత్రాలు చదును చేసే యంత్రాన్ని తెచ్చి రోడ్ కు మరమ్మతులు ప్రారంభించారు ఎక్కువ సంఖ్యలో యంత్రాలను పెట్టీ రోడ్ ను అభివృద్ది చేసారు. కేవలం 48 గంటల్లో రెండు కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం అకుంఠితదీక్షతో పూర్తిచేయడం చూసిన స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది రూపాయలు వెచ్చించి నెలలకొద్ది పనులు చేసే కాంట్రాక్టర్లకు అధికారులు కు సాయినాథ శర్మ అభిమానులు కళ్ళు తెరిపించే విధంగా కేవలం రెండు రోజుల్లో రోడ్డును అభివృద్ధి చేశారు వీరు చేపట్టిన రోడ్డు నిర్మాణం కాంట్రాక్టర్లకు అధికారులకే ప్రజలను స్వార్థానికి వాడుకోవాలని చూస్తున్న నాయకులకు సైతం మార్గదర్శకంగా నిలుస్తోంది. రోడ్డు నిర్మాణం పూర్తి కావడంతో ఆలయానికి వెళ్లే భక్తులకు పూర్తిస్థాయిలో ఇబ్బందులు తొలగిపోయాయి.పెండ్లిమర్రి మండల పెండ్లిమర్రి మండలంలోని నాగాయపల్లె చుట్టుపక్కల గ్రామ ప్రజలు, భక్తులు శివాలయం లోని పరమేశ్వరుడిని దర్శించుకోవటానికి పూర్తిస్థాయి సౌకర్యం ఏర్పడింది. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ రోడ్డు ని బాగు చేసే నాధుడే కరువయ్యరని, నాయకులు* *గాని, అధికారులు గాని స్పందించక పోవడంతో ఈ రోడ్డు నిర్మాణం పై తమ ఆశలు వదిలేసామని పేర్కొన్నారు. రోడ్డు నిర్మాణ విషయాన్ని నియోజకవర్గ స్థాయి నాయకులకు అనేకసార్లు విన్నవించిన ఏమాత్రం ఫలితం లేదని వారు వాపోయారు. అయితే మూడు రోజుల కిందట తన అభిమానుల ద్వారా* 

 *విషయం తెలుసుకున్న నియోజకవర్గ ప్రజానాయకుడు నిరుపేదల సేవకుడు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న తెలుగు నాడు ప్రజాసేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి కాశీ భట్ల సత్య సాయినాథశర్మ వెంటనే స్పందించిన తీరు ఆయన మంచి మనసుకు ప్రజా సేవకు తార్కాణంగా నిలుస్తోంది. సాయినాథశర్మ చేసిన మంచి వారి అభిమానుల స్వచ్ఛమైన మనసు శ్రమించే గుణం తోడు కావడం అభివృద్ధికి బాట వేసింది. ఈ సందర్భంగా అభిమానులు అబ్బిరెడ్డి మాధవరెడ్డి ఇరగం రెడ్డి బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ఏదైనా ఒక పని చేస్తే పదిమందికి ఉపయోగపడి వారు హర్షించాలన్నారు. నేటితరం రాజకీయ నాయకుల మనస్తత్వాలకు భిన్నంగా మా నాయకుడు సాయినాథ్ శర్మ తమను సేవా దృక్పథం వైపు మనసు మళ్లే విధంగా ప్రోత్సహించడం హృదయంలో సేవా భావం ఉన్న వారికే చెల్లుతుందన్నారు. శివాలయంకు వెళ్ళే మార్గాన్ని మరమ్మత్తు చేసి శివభక్తులు సులభంగా శివదర్శనం చేసుకోనెలా చేసినందుకు* *తనకెంతో సంతోషంగా సాయినాథ శర్మ అభిమానులు పేర్కొంటున్నారు.ఈ అవకాశం కల్పించిన* **పరమేశ్వరుడికి శతకోటి నమస్కారాలు చేసారు కాగా ఆన్ని తామై దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసిన తన అభిమానులు అబ్బిరెడ్డీ మాధవ రెడ్డి బాల కృష్ణారెడ్డి లను ఆయన అభినందించారు. నియోజకవర్గ వ్యాప్తంగా తమ అభిమానులందరూ సమాజ సేవ వైపు మోగ్గుచూపాలని ప్రతి ఒక్కరూ తమవంతుగా సమాజాభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు.

About Author