కామాంధుడికి యావజ్జీవ కారగార శిక్ష
1 min readమహబూబ్ నగర్ జిల్లా ఫరూక్‌నగర్ మండలం ఎలికట్టలో రెండేళ్ల క్రితం జరిగిన దుర్ఘటనలో నిందితుడికి యావజ్జీవం విధించింది కోర్టు. జంగం మంగమ్మ అనే మహిళ (34)ను..జంగం రాములు తన కోరికను తీర్చాలని ఒత్తిడి చేసేవాడు. అదేక్రమంలో 2019 మార్చి 26న రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మంగమ్మను నా కోరిక తీర్చకపోతే నిన్ను బతకనివ్వనంటూ జంగం రాములు ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. అటుగా వెళ్తున్న వారు మంటలు ఆర్పి షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. మెరుగైన చికిత్స కోసం హైద్రాబాద్‌కు తరలించగా మార్గ మధ్యలో మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేశారు. అప్పటి షాద్‌నగర్ సీఐ శ్రీధర్ కుమార్ నేర అభియోగపత్రం దాఖలు చేయగా, న్యాయస్థానంలో కేసు విచారణ సమయంలో పబ్లిక్ ప్రాసిక్యూటర్ బి.బాలగంగాధర్‌రెడ్డి 19 మంది సాక్షులను ప్రవేశపెట్టారు. ఇరు పక్షాల వాదోపవాదనలు విన్న తర్వాత నేరస్థుడిగా రాములు రుజువుకావడంతో యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 5వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్. ప్రేమావతి తీర్పు ఇచ్చారు.