కమనీయం శ్రీ రామ శోభాయాత్ర..
1 min readశ్రీ రామ నామస్మరణలతో మార్మోగిన మంత్రాలయం
– పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో రాముడి శోభ యాత్ర
– శోభ యాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి
– పెద్ద ఎత్తున తరలి వచ్చిన గ్రామస్థులు, భక్తులు.
– కులమతాలకు అతీతంగా యాత్ర లో పాల్గొన్న ముస్లిం మైనార్టీ సోదరులు
ఆకట్టుకున్న పిల్లల ప్రత్యేక వేషధారణ
పల్లెవెలుగు వెబ్ మంత్రాలయం: అయోధ్య క్షేత్రంలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపన, రామమందిరం ప్రారంభోత్సవం ను పురస్కరించుకుని మంత్రాలయం లో శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో శ్రీ రామ శోభ యాత్ర కమనీయం గా సాగింది. జై శ్రీరామ్ నామంతో మంత్రాలయం పురవీదులు మార్మోగాయి . ముందుగా పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థులు యోగీంద్ర కళా మండపంలో శ్రీ రాముడికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం గ్రామస్థులు, భక్తుల మధ్య స్వామి వారి పల్లకి ని తుంగభద్ర నది తీరం, వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వర, ఆంజినేయ్య స్వామి, మారికాంబదేవి దేవాలయాల ముందు గా పంచాయతీ కార్యాలయం వద్ద నుంచి ఎంటీఆర్ సర్కిల్, స్టేట్ బ్యాంక్ మీదుగా నాగలదిన్నె రహదారి గుండా రామచంద్ర నగర్ లో ప్రవేశించి వాల్మీకి విగ్రహం వద్ద నుంచి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భాగం గుండా రాఘవేంద్రనగర్ లో ప్రవేశించి యల్లమ్మ గుడి మీదుగా వినాయక సర్కిల్ వద్ద ప్రధాన రహదారి గుండా రాఘవేంద్ర సర్కిల్ మీదుగా తిరిగి శ్రీ మఠం వరకు శోభాయాత్ర సాగింది. రాఘవేంద్ర సర్కిల్ లో ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి పీఠాధిపతి కి పూలమాలలు వేసి నమస్కరించి పల్లకిని మోశారు. అనంతరం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కి పూలమాల వేసి ఆశీర్వాదించారు. వేడుక ప్రారంభం నుంచి చివరి వరకు కులమతాలకు అతీతంగా ముస్లిం లు యాత్ర లో పాల్గొన్ని జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటు శ్లోకాలు పలికారు. పిల్లలు వేసిన శ్రీ రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయ స్వామి వేషధారణ ఎంతగానో ఆకట్టుకున్నాయి. స్వామి వారి పల్లకోత్సవం ను పురస్కరించుకుని గ్రామంలోని పలువురు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా అల్పాహారం, నిమ్మకాయ రసం, వాటర్ ప్యాకెట్లు ఏర్పాటు చేశారు. మరి కొంత మంది బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో జై శ్రీరామ్ జెండాలు, కండువా లు పంపిణీ చేశారు. శోభ యాత్ర లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మంత్రాలయం, కోసిగి సీఐ లు ఏరిషావలి, ప్రసాద్ ఎస్ఐ లు వేణుగోపాల్ రాజు, కిరణ్, సతీష్, సిబ్బంది ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. రాఘవేంద్ర సర్కిల్ లో శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి వారి కి, ఎమ్మెల్యే వై. బాలనాగిరెడ్డి కి , శ్రీ మఠం అసిస్టెంట్ మేనేజర్/పీఆర్వో, సీఆర్వో ఐపీ. నరసింహా మూర్తి స్వామి కి బొంబాయి శివ శాలువ కప్పి పూలమాలలు వేసి సన్మానించారు. ఈ కార్యక్రమంలో వనిత క్లబ్ సభ్యులు, మండల నాయకులు పెట్రోలు బంక్ శీనన్న, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర, సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి, ఉప సర్పంచ్ హోటల్ పరమేష్, ఎంపిటిసి సభ్యులు వెంకటేష్ శెట్టి, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.