మిజోరం గవర్నర్ గా కంభంపాటి హరిబాబు
1 min read
పల్లెవెలుగు వెబ్: విశాఖపట్నం మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు మిజోరం గవర్నర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. పలు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. కేంద్ర మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ కు గవర్నర్ పదవి ఇవ్వడం గమనార్హం. ఆయన కర్ణాటక గవర్నర్ గా నియమితులయ్యారు. హర్యాణ గవర్నర్ గా బండారు దత్తాత్రేయ, మధ్యప్రదేశ్ గవర్నర్ గా గంగూభాయ్ పటేల్, గోవా గవర్నర్ గా శ్రీధరన్ పిళ్లై, త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్, ఝార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బైస్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ నియమితులయ్యారు.