PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌మ‌ల్ హాస‌న్ ` విక్ర‌మ్ ` ఫ‌స్ట్ రివ్యూ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కమల్‌హాసన్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌ కీలక పాత్రల్లో లోకేశ్‌ కనకరాజు దర్శకత్వం వహించిన ‘విక్రమ్‌’ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా విడుదలకు ముందే ప్ర‌ముఖ హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్‌ సినిమాకు తొలి రివ్యూ ఇచ్చేశారు. తమిళనాడు వ్యాప్తంగా చిత్రాన్ని ఉదయ్‌ నిధిస్టాలిన్‌ డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు. ఇటీవల ఆయన కోసం ప్రత్యేకంగా షో ఏర్పాటు చేశారు. సినిమా చూసిన తర్వాత ఉదయ్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘‘విక్రమ్‌’ సినిమా సూపర్‌గా ఉంది. కమల్‌హాసన్‌ సర్‌కి కృతజ్ఞతలు. దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌, విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాజిల్‌, సంగీత దర్శకుడు అనిరుద్ధ్‌ చిత్ర బృందమంతా మంచి అవుట్‌పుట్‌ తీసుకొచ్చారు. సినిమా చూస్తున్నంత సేపు గొప్ప అనుభూతి కలిగింది. తప్పకుండా ఈ చిత్రం బ్లాక్‌బస్టర్‌ అవుతుంది’’ అని ట్వీట్‌ చేశారు.

                           

About Author