‘కామినేని’తో… ఆరోగ్యం పదిలం..
1 min read
– ఆరోగ్య సమస్యలకు … చక్కటి పరిష్కారం– తక్కువ వ్యయంతో… మెరుగైన వైద్య చికిత్సలు
– జెమ్కేర్ కామినేని హాస్పిటల్ సీఈఓ, జనరల్ ఫిజిషియన్ డా. చంద్రశేఖర్– ఘనంగా హాస్పిటల్ మొదటి వార్షికోత్సవం
కర్నూలు, పల్లెవెలుగు: తక్కువ వ్యయంతో… మెరుగైన వైద్య సేవలు అందించడంలో తమ ఆస్పత్రి ముందుంటుందన్నారు జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీఈఓ, జనరల్ ఫిజిషియన్ డా. చంద్రశేఖర్. ఆరోగ్య సమస్యలకు సంబంధించి.. ప్రజలు ఏ సమస్యతో వచ్చినా వైద్య చికిత్సలతోపాటు ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సలహాలు.. సూచనలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తామని, ఇది తమ బాధ్యతగా భావిస్తామన్నారు. కర్నూలు నగరంలోని కొత్తబస్టాండ్ ఎదురుగా జెమ్కేర్ కామినేని హాస్పిటల్ ఏర్పడి సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా శనివారం హాస్పిటల్ ఆవరణలో మొదటి వార్షికోత్సవాన్ని సిబ్బందితో కలిసి ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ మాట్లాడుతూ జెమ్కేర్ కామినేని హాస్పిటల్ ఏర్పడిన సంవత్సరంలోనే ప్రజల నుంచి మంచి ఆదరణ పొందామన్నారు. ఆధునిక టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందించడంలో తమ ఆస్పత్రి సక్సెస్ అయిందన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించామని…. మధ్య తరగతి కుటుంబీకులకు తక్కువ వ్యయంతో ఆపరేషన్లు చేసి.. వారి మన్ననలు పొందామని ఈ సందర్భంగా డా. చంద్రశేఖర్ వెల్లడించారు. హాస్పిటల్ ఏర్పడి ఏడాదిలోనే ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిందంటే.. ఆస్పత్రి వైద్యులు, సిబ్బంది అందించే సేవలే కారణమని చెప్పడంలో సందేహం లేదన్నారు. ఏడాదికేడాది టెక్నాలజీతో కూడిన వైద్య సేవలు అందించడంలో మరింత ముందుంటామని, కర్నూలు జిల్లా ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామని ఈ సందర్భంగా జెమ్కేర్ కామినేని హాస్పిటల్ సీఈఓ, జనరల్ ఫిజిషియన్ డా. చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనంతరం మొదటి వార్షికోత్సవ కేక్‌ను కట్ చేసి సిబ్బందికి, ప్రజలకు పంచారు. కార్యక్రమంలో ఆర్థో పిడిషియన్ డా. రవిబాబు, సర్జన్ డా. బాల మురళీకృష్ణ, ఎమర్జెన్సీ మెడిసిన్ డా. రామ్మోహన్ రెడ్డి, కార్డియాలజి డా. రాఘవేంద్ర, డా. గణేష్ , జనరల్ మేనేజర్( ఆపరేషన్స్) నదీమ్, మరియు మార్కెటింగ్ డీజీఎం రమణ తదితరులు పాల్గొన్నారు.