‘కనకదుర్గమ్మ’ ఆశీర్వాదం.. ప్రజలందరికీ ఉండాలి
1 min read– నగర మేయర్ నూర్జహాన్ పెద్దబాబు
పల్లెవెలుగు వెబ్, ఏలూరు: కనకదుర్గమ్మ వారి ఆశీస్సులు ప్రజలందరికీ నిండుగా ఉండాలని నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు అన్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న మేయర్ దంపతులకు సిబ్బంది స్వాగతం పలికారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర, జాకెట్టు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులకు ఆశీర్వచనాలు ఇచ్చి తీర్థప్రసాదాలు అందించారు. శ్రీ దుర్గా మల్లేశ్వరి స్వామి దేవస్థానం ట్రస్ట్ సభ్యులు గంట ప్రసాద్, సుజాతలు మేయర్ దంపతులను సత్కరించారు.
ఆత్మీయ కలయిక : విజయవాడ నగర మేయర్ భాగ్యలక్ష్మి, ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు దంపతులు శుక్రవారం విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధిలో అనుకోకుండా ఒకరినొకరు కలుసుకున్నారు. మొదటిసారిగా వీరు కలుసుకోవడంతో ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుని, దేవస్థానం లాంజ్ లో కొద్దిసేపు ముచ్చటించారు. రాష్ట్రంలోని మేయర్లు అందరూ ఒకసారి కలుసుకోవాలని వారిద్దరూ అభిప్రాయపడ్డారు.