ఘనంగా కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: కర్నూలు మద్దూర్ నగర్ లోని పింగళి సూరన్న తెలుగు తోటలో,తెలుగు నాటక రచయిత కందుకూరి వీరేశ లింగం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసిజన్మదిన వేడుకలు ఘనంగా కర్నూలు జిల్లా రంగస్థలం కళాకారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కార్యదర్శులు గుర్రపు శాల అంకయ్య పి హనుమంతరావు చౌదరి అధ్యక్షతన జరిగాయి ఈ కార్యక్రమంలో రంగస్థలకళాకారులు ,కళా ప్రియ తిరుపాలు, గోవిందరాజులు, వివి రమణాచారి ,డిన్వవిసుబ్బయ్యనాగేశ్వరరావుడి పుల్లయ్య ,టీ రాజశేఖర్ ,మనోహర్ బాబు, ఎలమర్తి మేకప్ శివన్న ,వహీదా బేగం ,చిన్నారి సాహి,పాల్గొన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు చౌదరి మాట్లాడుతూ కందుకూరి వీరేశలింగం పంతులు నాటక రచయితగొప్ప సంఘసంస్కర్త అని వీరేశలింగం సామాజిక స్ఫూర్తిని భావితరాలకు చాటి చెప్పాడని కందుకూరి వీరేశలింగం పంతులు జయంతి రోజున తెలుగు నాటకోత్సవంగా గుర్తించారని ఇప్పుడు కలలు మరుగైపోతున్న సందర్భంగా మనమందరం రంగస్థలం బతికించుకుందామని నాటకోత్సవాలు జరుపుకుందామని కలలను కాపాడుకుందామని భావితరాల వారికి కందుకూరిని స్ఫూర్తిగా తీసుకొని కళాకారుల కోసం పాటుపడుదామని హనుమంతరావు చౌదరి అన్నారు.