PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

సోవియ‌ట్ యూనియ‌న్ చివ‌రి అధ్య‌క్షుడు క‌న్నుమూత

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : సోవియట్ యూనియన్ నేత మిఖాయిల్ గోర్బచేవ్‌(91) తుదిశ్వాస విడిచారు. చాలాకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్లు రష్యా వార్తా సంస్థలు తెలిపాయి. సోవియట్ యూనియన్ చివరి అధ్యక్షుడైన గోర్బచేవ్.. ప్రచ్ఛన్నయుద్ధం ముగింపులో కీలక పాత్ర పోషించారు. ఏడేళ్లు అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విప్లవాత్మక సంస్కరణలు తీసుకొచ్చి చెరగని ముద్ర వేశారు.సోవియట్ యూనియన్‌ అధ్యక్షుడిగా 1985-1991 వరకు కొనసాగారు గోర్బచేవ్. రష్యా-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గించి ద్వైపాక్షిక సంబంధాలు బలపర్చిన నేతగా ఘనత సాధించారు. అంతేకాదు. ఆయన హయాంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అంతకుముందు నేతల్లా నిరసనకారులపై ఉక్కుపాదం మోపకుండా శాంతియుతంగా వ్యవహరించారు. తూర్పు యూరప్‌కు సోవియట్ యూనియన్ పాలన నుంచి విముక్తి కల్పించారు. అప్పటి నుంచే సోవియట్ యూనియన్ విడిపోయింది.

                                                

About Author