మనుషుల మధ్య సమానత్వం కోసం పోరాడిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్
1 min read
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు: భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో కార్ల్ మార్క్స్ 142 వర్ధంతి కార్యక్రమం ఆర్ఆర్ పేట స్ఫూర్తి భవన్ నందు జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగ ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి ఒక నూతన మార్గాన్ని దోపిడీలైన సమాచారాన్ని అందరికీ సమాన అవకాశాన్ని అందరూ సుఖసంతోషాలతో జీవించడానికి కావలసిన పద్ధతిని తెలియజేస్తూ మార్క్సిజంని రూపొందించిన కార్ల్ మార్క్స్ మరణించి142 ఏళ్ళు అయినా ఆయన చూపిన మార్గం ఇప్పటికీ అనుసరణీయమని తెలిపారు.ప్రపంచంలో అప్పటికే ఉన్న అనేక శాస్త్రాల సారాంశాన్ని తెలుసుకొని వాటన్నిటిని క్రోడీకరించి ఒక కొత్త సిద్ధాంతాన్ని రూపొందించడం ద్వారా మనుషుల మధ్య సమానత్వం తీసుకురావాలని తద్వారా సోషలిస్టు సమాజాన్ని స్థాపించాలని కార్ల్ మార్క్స్ ఆయన మిత్రుడు ఎంగెల్స్ కలిసి రూపొందించిన కమ్యూనిస్టు మేనిఫెస్టో పెట్టుబడి గ్రంథాలు ప్రపంచ ఉద్యమాలకు దిక్సూచిగా మారాయని కొనియాడారు. కార్ల్ మార్క్స్ తాను ఉండే ఇంటి అద్దెను సైతం చెల్లించలేని పరిస్థితుల్లో ఉండి కూడా మనుషుల మధ్య సమానత్వం సాధించడానికి తాను నమ్మిన సిద్ధాంతాన్ని రూపొందించేందుకు అనేక కష్టాలను ఇబ్బందులను ఎదుర్కొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబాన్ని తన జీవితాన్ని తన ఆర్థిక స్థితిగతులన్నిటిని పణంగా పెట్టి, ప్రపంచ ప్రజల సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకొని మార్క్సిజాన్ని సృష్టించిన మహోన్నత వ్యక్తి కార్ల్ మార్క్స్ అని కొనియాడారు. ఆయన కనిపెట్టిన అదనపు విలువ వలన ఈరోజు భారతదేశంలో 169 మంది బడా పెట్టుబడిదారుల చేతుల్లో ఈ దేశంలోని ప్రజల సంపద పోగుపడుతుండడం వల్ల పేదవాడు ఎప్పటికీ పేదవాడిగానే మిగిలిపోతున్నాడని ఈ విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తులో జరిగే పోరాటాలకు కార్ల్ మార్క్స్ చూపిన మార్గంలో ప్రజల్ని చైతన్య పరుస్తూ భవిష్యత్తు ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్ కార్యవర్గ సభ్యులు మావూరి విజయ,బళ్ల కనకదుర్గారావు, జిల్లా కౌన్సిల్ సభ్యులు భజంత్రీ శ్రీనివాసరావు, ఏరియా సమితి సభ్యులు నాగం అచ్యుత్, శాఖ కార్యదర్శి గొర్లి స్వాతి, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి ఎం క్రాంతి కుమార్,మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వర్క శ్యామల తదితరులు పాల్గొన్నారు.