PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్ణాటక మద్యం పట్టివేత

1 min read

పల్లెవెలుగు వెబ్​, పెద్దకడబూరు: మండలంలోని నెమలికల్లు గ్రామ శివారులోని ఎల్లెల్సీ కాలువ దగ్గర కర్ణాటక మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిపై దాడి చేసి పట్టుకున్నట్లు ఎస్​ఐ శ్రీనివాసరావు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పెద్దకడబూరుకు చెందిన బోయ మొట్రు రామాంజి నెమలికల్లు గ్రామంలోని ఎల్లెల్సీ కాలువ దగ్గర మోటారు సైకిల్​ ( AP21N7318)పై కర్ణాటక మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 288 (90 ml) కర్ణాటక ఒరిజినల్ చాయిస్ టెట్రా పాకెట్స్ ను, 48 (180 ml ) కర్ణాటక ఒరిజినల్ చాయిస్ టెట్రా పాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ శ్రీనివాసరావు తెలిపారు.

About Author