PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వీరభద్రుని సేవలో కర్నాటక సి.యమ్.ఓ. ఆఫీస్ అధికారి

1 min read

పల్లెవెలుగు వెబ్​, రాయచోటి: దక్షిణ కాశీగా పేరుగాంచి రాయచోటిలో వెలసిన  శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ని కర్నాటక రాష్ట్ర సి.యమ్.ఓ. ఆఫీస్ అధికారి శ్రీ కరుణేష్, శ్రీమతి విజయ దంపతులు మంగళవారం దర్శించుకొని స్వాములవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి  ఆలయ సాంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్  శ్రీమతి పోలంరెడ్డి విజయ గారు, పాలకమండలిసభ్యులు సురేష్ కుమార్, నాగభూషణం వీరిని సన్మానించి, దుశ్శాలువాతో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఈఓ మంజుల, అర్చకులు, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Author