PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కర్నాటక మద్యం పట్టివేత.. సెబ్ అడిషనల్ ఎస్పీ

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: సోమవారం కర్నూలు మండలం పంచలింగాల చెక్పోస్ట్ వద్ద  కర్నూలు లో జరగబోవు వినాయక చవితి నిమజ్జనం సందర్భంగా తెలంగాణా , కర్ణాటక లనుండి  నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం రవాణా ను నియంత్రించే చర్యల లలో భాగంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ను కర్నూలు టాస్క్ ఫోర్స్ సీఐ మరియు కర్నూల్ స్టేషన్ ఎస్ఐ లు వారివారి సిబ్బంది మరియు పంచలింగాల సీఐ తో కలసి పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ జరుపుతుండగా టాటా ఏస్ మ్యాజిక్ వాహనం AP 21 X 6886 ను  తనిఖీ చేయగా అందులో ప్రత్యేకంగా  ఏర్పాటు చేయబడిన కంపార్ట్మెంట్ ఏర్పాటు చేసి  ఉండడం చూసి అనుమానంతో తనిఖీ చేయగా అందులో కర్నాటక మద్యం 60 బాక్సులు ఉండి ఒక్కొక్క దానిలో 96 లెక్కన మొత్తం ఆ వ్యాన్ నందు 5760  ఒరిజినల్ ఒరిజినల్ ఛాయిస్ కర్ణాటక మద్యం టెట్రా ప్యాకెట్లు ఉండెను.  తదుపరి వాహనంలో ఉన్న ఇద్దరు వ్యక్తులను డ్రైవర్ని మరియు పక్కనున్న వ్యక్తిని విచారించగా, వారిలో డ్రైవరు  కర్ణాటక రాష్ట్రం రాయచూరు కి చెందిన ఈరన్న గౌడ మరియు కర్నూలు జిల్లా పత్తికొండ తుగ్గలి మండలం గుడిసె గుప్పిరాల గ్రామానికి చెందిన ఈడిగ రవీంద్ర అని తెలిపిరి.  వారిని విచారించగా ఈ మద్యం రాయచూరు చెందిన చంద్రబాబు అనే వ్యక్తి పంపించాడని  కర్నూల్ కు చేరగానే  సర్దార్ అలియాస్ భాష అనే వ్యక్తికి చెందిన  ఫోన్  చేయమని  చెప్పి ఫోన్ నంబర్ ఇచ్చారని   తెలిపారు.  ఇప్పుడు దొరికిన ఇద్దరు వ్యక్తులను పూర్తిగా  విచారించిన తర్వాత చంద్రబాబు మరియు బాషా లను త్వరలోనే అరెస్ట్ చేస్తామని సెబ్ అడిషనల్ ఎస్పీ కృష్ణకాంత్ పటేల్ తెలిపారు. ఈ దాడులలో టాస్క్ ఫోర్స్ సీఐ రాజశేఖర్ గౌడ్, పంచలింగాల సీఐ శేషాచలం,  ఎస్ఐలు ప్రసాదరావు, అన్వేష్,.స్వామినాథన్, సిబ్బంది వెంకటరాముడు, శెక్షవలి, కరుణాకర్, బషీర్,  శంకర్ నాయక్ లు పాల్గొన్నారు.

About Author