NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కర్ణాటక విజయంతో దేశాన్ని గెలవాలి

1 min read

– కమలాపురం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొట్టిపాటి చంద్రశేఖర్ రెడ్డి

పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రజలు బుద్ధిచెప్పారని  కర్ణాటకలో విజయంతో దేశాన్ని గెలవాలని  కమలాపురం కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ పొట్టి పార్టీ చంద్రశేఖర్ రెడ్డి  అన్నారు. మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసిన బలాన్ని అందించి ప్రజా వ్యతిరేక బీజేపీకి గట్టిగా బుద్ధి చెప్పారన్నారు. కర్నాటక ఎన్నికల్లో బీజేపీపై వ్యతిరేకత వ్యక్తమైందని, దీంతో నిరంకుశ బీజేపీ పాలనకు పతనం ప్రారంభమైందని, అలాగే రాబోయే ఇతర రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఇదే రకమైన బీజేపీ వ్యతిరేక తీర్పు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. ఈ విజయంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేతలు రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీ, ఏఐసీసీ ప్రెసిడెంట్‌ మల్లికార్జున్‌ ఖార్గే, కర్నాటక పీసీసీ చైర్మన్‌ శివకుమార్‌లకు అభినందనలు తెలుపుతూ  మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు విజయాన్ని అందించిన కర్నాటక ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు అందజేశారు. ఏపీలో బీజేపీతో పొత్తుకు ఉవ్విళ్ళూరుతున్న పార్టీలకూ ప్రజలు సరైన గుణపాఠం చెబుతారని నియోజకవర్గ ఇన్చార్జ్ పొట్టిపాటి చంద్ర శేఖర్ రెడ్డి అన్నారు.

About Author