PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా కర్ణ బత్తుల సేవా సంఘం కార్తీక వన సమారాధన

1 min read

పల్లెవెలుగు, వెబ్ ఏలూరు : స్థానిక అశోక్ నగర్ లో కర్ణ భక్తుల సేవా సంఘం 27వ వార్షికోత్సవం ఆదివారం సంఘo అధ్యక్షులు శలా కోట వీరయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు నగరంలోని కర్ణ బత్తుల సేవా సంఘం నాయకులు,సభ్యులు,కుల సంఘ కుటుంబీకులు ఉత్సాహంగా పాల్గొని సాంస్కృతి కార్యక్రమాలు, నృత్య విన్యాసాలతో, చిన్నారుల ఆటపాటలతో నిర్వహించి అలరించారు, మహిళలకు ఈ వివిధ ఆట పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు, అనంతరం సంఘం అభివృద్ధికి కృషి చేస్తున్న అల్లం సాంబశివరావు,కోట నాగలక్ష్మి దంపతులకు పూలమాలలు అందించి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు,ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు శలా కోట వీరయ్య , ఉపాధ్యక్షులు కాసా నెల బాలుడు,కోశాధికారి నిల్ల నాగేశ్వరరావు,ప్రధాన కార్యదర్శి వీరా జగదీష్ మరియు సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

About Author