మండల వ్యాప్తంగా కార్తిక మాస ఉత్సవాలు ప్రారంభం
1 min read– శివాలయాల ఎదుట ఆకాశదీపం ఆరోహణ
పల్లెవెలుగు వెబ్ చెన్నూరు : మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో నెలకొని ఉన్న శివాలయాల్లో కార్తిక మహోత్సవ పూజలు ప్రారంభమయ్యాయి. చెన్నూరు పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో ఉదయం గోపూజ కార్యక్రమాన్ని వేద పండితుల చేతుల మీదుగా నిర్వహించారు. గోవును ఆలయ ప్రదర్శనశాలలో ప్రవేశం కల్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయం ఎదురుగా ధ్వజస్తంభంపై ఆకాశదీపం ఆరోహణ నిర్వహించారు. చెన్నూరు బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ నాగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆకాశదీపం ఆరోహణ చేశారు. చెన్నూరు మండలం శివాలపల్లి గ్రామ సమీపంలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆలయ కమిటీ నిర్వాహకులచే ఆలయ గర్భగుడిలో అఖండ దీపాన్ని ఏర్పాటు చేశారు. ఉప్పరపల్లి గ్రామ సమీపంలో ఉన్న నాగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు ఆకాశదీపం ఆరోహణ నిర్వహించారు. కొండపేట శివాలయం బలసింగాయపల్లి గ్రామ సమీపంలో ఉన్న కైలాసగిరి కొండల్లో వెలసిన సిద్దలింగేశ్వర స్వామి, రామనపల్లిలో వెలసిన శ్రీ గౌరీ మల్లేశ్వర స్వామి. ఓబులంపల్లి. రాచనాయపల్లి గ్రామాల్లో శివాలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.