ప్రారంభమైన కార్తీక మాస ఉత్సవాలు
1 min readపల్లెవెలుగు, వెబ్ చెన్నూరు: కార్తీక మాస ఉత్సవాలు బుధవారం నుంచి అన్ని శివాలయాల్లో ప్రారంభమయ్యాయి. చెన్నూరు ట్రంక్ రోడ్డు లోని శ్రీ లలితాంబికా సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో ఉదయం గోపూజ గోవు ఆలయ ప్రదక్షిణ చాలా ప్రవేశం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల 45 నిమిషాలకు ఆకాశదీపం ఆరోహణ నిర్వహించారు. నాగేశ్వర స్వామి కి ప్రత్యేక అభిషేక పూజలు. లలితాంబిక దేవికి కుంకుమార్చన పూజలు నిర్వహించారు. చెన్నూరు పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజామున నాలుగు గంటలకు గోపూజ ఆలయ ప్రదర్శనశాల ప్రవేశం సాయంత్రం ఆకాశదీపం ఆరోహణ నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. మండలం శివాలపల్లి పరిధిలో ఉన్న కాశీ విశ్వనాథ ఆలయము,ఉప్పరపల్లి పరిధిలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం, రామనపల్లి శ్రీ గౌరీ మల్లేశ్వర ఆలయం, కొండపేట శివాలయం. వివిధ ఆలయాల్లో కార్తీక మాస ఉత్సవాలను ఆయా ఆలయ కమిటీ నిర్వాహకులు నిర్వహించారు. ఆలయాల దీపాలతో అలంకరించారు. ఆలయాల్లో సందర్శించే భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.