PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

నిర్మాత‌గా మారిన కార్తీక‌దీపం డాక్ట‌ర్ బాబు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కార్తీక దీపం సీరియల్‌తో డాక్టర్ బాబుగా, కార్తీక్ పాత్రలో నిరుపమ్ అదరగొట్టేశాడు. బుల్లితెరపై స్టార్ హీరోగా మారిపోయాడు. ఆయన ఏ సీరియల్‌లో ఉంటే ఆ సీరియల్ హిట్ అనేట్టుగా మారిపోయింది. ఇక స్టార్ మాలో కార్తీక దీపం చేస్తున్న సమయంలోనే జీ తెలుగులో హిట్లర్ గారి పెళ్లాం అనే సీరియల్‌ను నిర్మించాడు. నిర్మించడమే కాకుండా.. నటించి మెప్పించాడు నిరుపమ్. కార్తీక దీపం సీరియల్ నుంచి డాక్టర్ బాబు పాత్రను తీసేయడంతో అభిమానులు హర్ట్ అయ్యారు. వంటలక్క, డాక్టర్ బాబు లేని సీరియల్‌ను చూడమని జనాలు తిరస్కరించేశారు. అలా దెబ్బకు మళ్లీ నిరుపమ్, ప్రేమీ విశ్వనాథ్ పాత్రలను తీసుకొచ్చారు. ఇప్పుడు సీరియల్ టీఆర్పీ కాస్త మెరుగుపడింది. అయితే అలా గ్యాప్ వచ్చిన సమయంలో.. నిరుపమ్ కొన్ని ప్రాజెక్ట్‌లను ట్రై చేస్తోన్నట్టు చెప్పుకొచ్చాడు. మంజుల చేసిన యూట్యూబ్ వీడియోల్లో తన రాబోయే ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు. స్టార్ మాలో ఓ సీరియల్ నిర్మించబోతోన్నాను అని చెప్పుకొచ్చాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశాడు.

                              

About Author