NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కాశీబట్ల సాయినాథ్ శర్మ  అభిమానుల ఆనందోత్సహాలు

1 min read

పల్లెవెలుగు వెబ్  చెన్నూరు: కమలాపురం నియోజకవర్గం,పట్టణానికి చెందిన మాజీ టీడీపీరాష్ట్ర కార్యదర్శి ,పుణ్య భూమి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కాశీబట్ల సాయినాథ్ శర్మకు భారతదేశ నీతి అయోగ్ సోషల్ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ సంస్థ నుండి సేవా రత్న డాక్టరేట్ అవార్డు ప్రకటించడం పట్ల ఆయన చెన్నూరు అభిమానులు హర్షం వ్యక్తం చేశారు, ఈ సందర్భంగా ఆయన అభిమానులు చెన్నూరు కు చెందిన తుపాకుల జనార్దన్ రెడ్డి, గురు మహేశ్వర్ రెడ్డి, రాజారెడ్డి, శివారెడ్డి లు మాట్లాడుతూ , కరోనా కష్ట కాల సమయం లో కాశీభట్ల సత్య సాయినాధ శర్మ చేసిన సేవలు మరువలేనివని వారు తెలిపారు, ఆయన నిరంతరం ప్రజాసేవకే అంకితమై ఉన్నారని, అలాంటి మహోన్నతమైన వ్యక్తికి సేవరత్న డాక్టరేట్ కు ఎంపిక కావడం చాలా సంతోషకరమన్నారు, ఈ అవార్డులు ఆయన వ్యక్తిత్వానికి మరింత సంతోషాన్నిచ్చి మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడతాయని వారు అన్నారు , నిజంగా ఇలాంటి ప్రకటన వెలువడిన తర్వాత కాశీ బట్ల సత్య సాయినాధ శర్మ అభిమానులకు ముందే దీపావళి వచ్చినట్లు ఉందని అభిమానులు అందరూ కూడా సంబరాల్లో తేలిపోయారని వారు తెలియజేశారు, అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలపడానికి ఆయన స్వగృహానికి క్యూ కట్టారని, దీపావళికి ముందే దీపావళి జరిగినంత సంబరంగా అనుచరులు, కార్యకర్తలు శుభాకాంక్షలతో సాయినాథ్ శర్మ కార్యాలయం సందడిగా మారిందని వారు తెలిపారు, ఈ కార్యక్రమంలో చెన్నూరు మండలానికి చెందిన తుపాకుల జనార్దన్ రెడ్డి, గురు మహేశ్వర్ రెడ్డి, వి. వీర శివారెడ్డి, రాజారెడ్డి, చెంగా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

About Author