కశ్మీర్ ఒక్కటే భారత్ – పాక్ మధ్య సమస్య !
1 min readపల్లెవెలుగు వెబ్: భారత్ – పాక్ సంబంధాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు. టీ20 మ్యాచ్ లో తమ జట్టు విజయం సాధించిన తరుణంలో ఆ విషయం పై స్పందించడం సరికాదన్నారు. సౌదీ అరేబియా రాజు మహ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకు ఇమ్రాన్ ఖాన్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు. రియాద్ లో సోమవారం ఏర్పాటు చేసిన పాక్-సౌదీ ఇన్వెస్ట్మెంట్ ఫోరం సమావేశంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినట్టు డాన్ పత్రిక పేర్కొంది. భారత్ – పాక్ పరిష్కరించుకోవాల్సిన సమస్య కశ్మీర్ ఒక్కటేనని ఆయన పేర్కొన్నారు. మానవ హక్కులకు సంబంధించిన విషయమిది అని ఇమ్రాన్ అన్నారు. ఉభయ దేశాల మధ్య వేరే సమస్యలు ఏవీ లేవని ఇమ్రాన్ తెలిపారు.