NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కస్తూరిభా పాఠశాలలు ఆదర్శంగా ఉండాలి

1 min read

– డాక్టర్ వినయ్ బాబు
పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: కస్తూరిభా పాఠశాలలు ఇతర పాఠశాలలకు ఆదర్శంగా నిలవాలని డాక్టర్ వినయ్ బాబు పేర్కొన్నారు.అన్నమయ్య జిల్లా పరిధిలోని వీరబల్లి మండలంలో గురువారం స్థానిక కస్తూరిభా గురుకుల పాఠశాలను గర్ల్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫ్ కమిటీ సభ్యులు ఎంఇఓ గిరివరదయ్య ,సీడీపీఓ పద్మజ కలసి పాఠశాలను సందర్శించారు. పాఠశాల పరిశుభ్రత, వంటగది పరిశీలించారు. పాఠశాలలో విద్య, భోజనం, తదితర అంశాలపై విద్యార్థులును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ వినయ్ బాబు మాట్లాడుతూ వంట గది ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ప్రభుత్వం ఇచ్చిన మెనూ ప్రకారం భోజనం అందించాలన్నారు. అనంతరం విద్యార్థినులకు హ్యాండ్ వాష్, పర్సనల్ హైజిన్, గుడ్ టచ్, బాడ్ టచ్, అనిమియా, చైల్డ్ మ్యారేజ్, వ్యక్తిగత, పర్సనల్ పరిశుభ్రతలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కుసుమలత, ఉపాద్యయనిలు, ఆసుపత్రిసిబ్బంది, జూనియర్ కళాశాల, పాఠశాల విద్యార్థినులు పాల్గొన్నారు.

About Author