NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పెద్దమ్మ జాతరలో పాల్గొన్న యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి

1 min read

– మేళ తాళాలతో పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికిన గ్రామ పెద్దలు
పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె : మండలం టంగుటూరు గ్రామం లో పెద్దమ్మ జాతరకు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి తనయుడు వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి హాజరు అయ్యారు.కాటసాని ఓబుల్ రెడ్డి గ్రామ పెద్దలు,వైయస్సార్ పార్టీ నాయకులు,కార్యకర్తలు మేళ తాళాలతో, పూలమాలలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైయస్సార్ పార్టీ యువ నాయకుడు కాటసాని ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కూడా టంగుటూరు గ్రామంలో పెద్దమ్మ జాతర జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందని పెద్దమ్మ జాతర జరుపుకోవడం వల్ల తమ గ్రామంలో కరువు కాటకాలు రాకుండా ఆ అమ్మవారి కరుణాకటాక్షాలు ఉంటాయని ఈ గ్రామ ప్రజల అపార నమ్మకమని ఆ అమ్మవారి దయవల్ల నేటికీ కూడా ఈ గ్రామంలో కరువు కాటకాలు రాకుండా ఉండడం అమ్మవారి నిలువెత్తు ఆశీస్సులకు నిదర్శనమని చెప్పారు. ఈ బనగానపల్లె నియోజకవర్గం ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ అమ్మవారిని వేడుకోవడం జరిగిందని అలాగే నిత్యం ప్రజల కోసం కష్టపడే మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ అమ్మవారిని కోరుకోవడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అవుకు మండలం వైయస్సార్ పార్టీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డి, నంద్యాల జిల్లా వైఎస్ఆర్ పార్టీ యువజన సంఘం అధ్యక్షుడు గుండం నాగేశ్వర్ రెడ్డి, టంగుటూరు గ్రామ వైఎస్ఆర్ పార్టీ నాయకుడు సురేష్ కుమార్ రెడ్డి ,పెద్ద శివారెడ్డి ,హనుమంత రెడ్డి ,ఎంపీటీసీ మహానంద రెడ్డి ,డి హుసేని, డి సుబ్బలక్ష్మి రెడ్డి, కైపా ప్రతాప్ రెడ్డి, అప్పలాపురం హరీష్ రెడ్డి, ఎర్రగుడి రామసుబ్బారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author