PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రత్యేక పూజలు నిర్వహించిన కాటసాని

1 min read

పల్లెవెలుగు వెబ్ బనగానపల్లె: మండలంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సోదరుడు వైయస్ఆర్సీపీ బనగానపల్లె నియోజకవర్గం సీనియర్ నాయకులు పారిశ్రామికవేత్త కాటసాని చంద్రశేఖర్ రెడ్డి,కాటసాని ఉమాదేవి, దస్తగిరి రెడ్డి, కొండారెడ్డి, శ్వేతా రెడ్డి లు కలిసి సుబ్రమణ్యం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం స్వామివారికి వెండితో తయారు చేయించిన నాగుల పడుగను స్వామివారికి సమర్పించారు. ముందుగా కాటసాని చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయం చేరుకోగానే ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాటసాని అభిమానులు భక్తులు పాల్గొన్నారు.

About Author