వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కటికె గౌతమ్ నియామకం
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశానుసారం కేంద్రకార్యాలయం నుండి కర్నూలు జిల్లా నుండి మాజీ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర బీసీ కార్పోరేషన్ డైరెక్టర్ కటికె గౌతమ్ ని నియమిస్తూ ఉత్తర్వులు జారిచేయడం జరిగింది.కటికె గౌతమ్ కోడుమూరు నియోజకవర్గం గార్గేయపురం గ్రామం నివాసి కాగా 2013 నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమాల్లో చురుకుగా పాల్గొని కర్నూలు జిల్లా పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి గా విద్యార్థి విభాగానికి నాయకత్వం వహించి తనదైన శైలి వాక్చాతుర్యంతో అప్పటి ప్రభుత్వాలను విద్యార్థి ఉద్యమాలతో నిరసనలతో ర్యాలీలతో విద్యార్థి హక్కుల సాధనకై పోరాటాలు చేసి కర్నూలు పార్టీ పెద్దల దృష్టిలో ఉండగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు కాగానే కర్నూలు జిల్లా పార్టీ పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ఆరెకటిక కార్పొరేషన్ ఛైర్మెన్ గా జిల్లా నుండి ప్రతిపాదనలు పంపడం కొన్ని పార్టీ అంశాల మేరకు రాష్ట్ర డైరెక్టర్ గా ఎన్నిక కావడం అందరికి విదితమే.కాగా ఇప్పుడు కటికె గౌతమ్ కి రాష్ట్ర విద్యార్థి విభాగం అధికార ప్రతినిధి గా ఎంపిక చేయడంతో కర్నూలు జిల్లా పార్టీ పెద్దలు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.రాబోయే రోజుల్లో గౌతమ్ మరింత చురుకుగా ఎన్నో ఉద్యమాలు చేసి పార్టీ విధివిధానాలు కూటమి ప్రభుత్వ తప్పులను ఎండకడుతూ ప్రజలను ముఖ్యంగా విద్యార్థులను పార్టీకి దగ్గర చేసి తరువాత వారికి అండగా నిలవాలని దానికి మా పూర్తి మద్దతూ సహకారం విద్యార్థి నాయకుడు గౌతమ్ పై ఎప్పటికి ఉంటాయని కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి కొనియాడారు.పలువురు జిల్లా నాయకులు జిల్లా విద్యార్థి విభాగము నాయకులు రాయలసీమ యూనివర్సిటీ విద్యార్థులు గౌతమ్ ని సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.