NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

క‌త్తి మ‌హేష్ ఇక‌లేరు !

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ సినీ విమ‌ర్శకుడు క‌త్తి మ‌హేష్ క‌న్నుమూశారు. ఇటీవ‌ల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయ‌ప‌డ్డ క‌త్తి మహేష్ .. చికిత్స పొందుతూ మృతి చెందారు. త‌ల‌, శ‌రీరంపై తీవ్రగాయాలు కావ‌డంతో.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శ‌స్త్ర చికిత్స అనంత‌రం ఆయ‌న కోలుకుంటున్నట్టు వైద్యులు చెప్పారు. అయితే.. శ‌నివారం క‌త్తి మ‌హేష్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించ‌డంతో ఆయ‌న మృతిచెందారు. క‌త్తి మహేష్ మృతితో ఆయ‌న బంధువులు, సన్నిహితులు క‌న్నీరుమున్నీర‌వుతున్నారు. గ‌త నెల 26న నెల్లూరు జిల్లా కొడ‌వ‌లూరు మండ‌లం చంద్రశేఖ‌ర పురం జాతీయ ర‌హ‌దారిపై క‌త్తి మహేష్ కారు ప్ర‌మాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఆయ‌న తీవ్రంగా గాయ‌ప‌డ్డారు.

About Author