NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వెంటిలేట‌ర్ పై క‌త్తి మ‌హేష్

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: ప్రముఖ సినీ విమ‌ర్శకుడు క‌త్తి మ‌హేష్ కు ఇటీవ‌ల జ‌రిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాల‌య్యాయి. త‌ల‌కు, కంటికి తీవ్రగాయాల‌వ‌డంతో ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి కాస్త విష‌మంగా ఉంది. ఆస్పత్రిలో చేరే స‌మ‌యంలో శ్వాస తీసుకోవ‌డంలో ఇబ్బందులు ఎదుర్కొన్నార‌ని, అందుకే వెంటిలేట‌ర్ పై చికిత్స కొన‌సాగిస్తున్నామ‌ని వైద్యులు తెలిపారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉండ‌టంతో కుటుంబ స‌భ్యుల కోరిక మేర‌కు చెన్నైలోని ఓ ఆస్పత్రికి త‌ర‌లించిన‌ట్టు ఆస్పత్రి వ‌ర్గాలు తెలిపాయి. ప్రమాదం జ‌రిగాక ఆస్పత్రికి తీసుకొచ్చార‌ని, ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం సిటీ స్కాన్ చేయ‌గా త‌ల‌కు, కంటి భాగాల‌కు తీవ్ర గాయాలైన‌ట్టు వైద్యులు గుర్తించారు. కుటుంబ స‌భ్యుల విజ్ఞప్తి మేర‌కు క‌త్తి మ‌హేష్ ను చెన్నైకి త‌ర‌లించిన‌ట్టు వైద్యులు తెలిపారు.

About Author