NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అభాగ్యులకు ఆపద్బాంధవుడు కత్తిరి రామ్మోహన్

1 min read

పల్లెవెలుగు వెబ్​, ఏలూరు: ఎంత ఉన్నత స్థాయికి ఎదిగ మన్న దానికన్నా  ఉన్న దానిలో పదిమందికి సాయపడడం     మిన్న అనే నిర్వచనాన్ని రుజువు చేశారు. ఇ యువ కార్పోరేటర్,మన ప్రియతమ అధినాయకుడు డిప్యూటీ సీఎం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ళ నాని  పుట్టినరోజు సందర్భంగా ఏలూరులో ఉన్న నిరుపేదలు ఫుట్ పాత్ పై నిద్రించే అబాగ్యులకు దుప్పట్లు, రగ్గులు పంపిణీ  కార్యక్రమం 33వ డివిజన్  కార్పొరేటర్  కత్తిరి రామ్మోహన్ సౌజన్యంతో పేదలకు పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా ఎన్నో సందర్భాల్లో ఎంతో ధనాన్ని వెచ్చించి పూల బొకేలు శాలువాలు అందిస్తున్నామని కానీ గడిచిన మరుసటి రోజుకి ఆ బహుమతులను నిరుపయోగంగా మారుతాయని.అన్ని సందర్భాల్లో కాకుండా ఇలా అవసరమైనప్పుడు అలా ఖర్చు చేసే డబ్బులతో నగరంలో ఎంతో మందికి ఈ శీతాకాల సమయంలో రహదారులకు ఇరువైపుల నగరంలోని పలు కూడళ్లలో ఆశ్రయం ఆదరణ నోచుకోని అభాగ్యులను వెతికి దుప్పట్లు, రగ్గులు అందించారు. అందించడం ద్వారా వారికి ఉపయోగపడతాయని రామ్మోహన్ తన సేవా గుణాన్ని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు, తాను అందిస్తున్న సేవా కార్యక్రమానికి సహకరించి వచ్చిన వైసీపీ నాయకులకు, స్నేహితులకు తన అభిమాన సంఘాల వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. రామ్మోహన్ చేస్తున్న సేవ గుణాన్ని కొనియాడుతూ పలువురు ఆదర్శంగా తీసుకోవాలని నగర అధ్యక్షులు బోద్దాని శ్రీనివాస్ సూచించారు,ఈ కార్యక్రమంలో ఏలూరు డిప్యూటీ మేయర్ గుడిదేసి శ్రీనివాస్, వైసీపీ నాయకులు పామర్తి అచ్యుత్ గౌడ్,పిటి నాగేశ్వరరావు,వెల్లంకి రాజు,ఎచ్చెర్ల ఉమా మహేష్, బండ్లమూడి సునీల్  మరియు వైయస్సార్ అర్ సిపి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

About Author