PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కౌశల్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలి

1 min read

– అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీరామ్ పురుషోత్తం

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా బ్యూరో: భారతీయ విజ్ఞాన మండలి ఆంధ్రప్రదేశ్ శాసన సాంకేతిక మండలి సంయుక్త ఆధ్వర్యంలో కౌన్సిల్ 2023 పరీక్షకి నోటిఫికేషన్ విడుదలైందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ రామ్ పురుషోత్తం గారు అన్నారు గురువారం డీఈవో కార్యాలయంలో ఏర్పాటుచేసిన కౌశల్ 2023 పోస్టర్ల  ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కౌశల్ సైన్స్ క్విజ్ పోటీని 8,9,10 తరగతుల విద్యార్థులతో క్విజ్ టీం ఏర్పడాలన్నారు. ఇది కేవలం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మాత్రమే అని అన్నారు. కనుక జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ పరీక్ష రాసే అవకాశం సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సిలబస్ గా 8,9, 10 తరగతిలో గణితము, సైన్సు, సాంఘిక శాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి మెటీరియల్, నిర్ణయించారు. బహుమతులు, ప్రశాంశా పత్రాలు, జ్ఞాపిక, నగదు బహుమతులు ఇవ్వడం జరుగుతుందన్నారు. పాఠశాల కోఆర్డినేటర్లు నవంబర్ ఐదు లోపు విద్యార్థుల పేర్లను డబ్ల్యు డబ్ల్యు డాట్ బి వి ఎం డాట్ ఏపీ డాట్ ఓఆర్జి www.bvmap.org లో నమోదు చేసుకోవచ్చన్నారు. 8, 9 తరగతుల నుండి ఇద్దరు రెండు ప్రజెంటేషన్లో ఒక పాఠశాల నుండి అనుమతించబడునన్నారు. బహుమతులు సర్టిఫికెట్, జ్ఞాపిక నగదు అందిస్తామని అన్నారు. కౌశల్ సైన్స్, క్విజ్ పోటీ అర్హులు 8,9,10 తరగతుల విద్యార్థుల సంఖ్య 3 (క్విజ్ టీం సంఖ్య కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మాత్రమే అన్నారు) 8, 9, 10 తరగతిలో గణితము, సైన్స్ సాంఘిక శాస్త్ర, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి మెటీరియల్ భారత్ దర్శన్ మెటీరియల్ చదవాలని అన్నారు. బహుమతులుగా ప్రశంసా పత్రం, జ్ఞాపిక, నగదు ఇవ్వబడునని అన్నారు. పోస్టర్ కాంపిటీషన్లో జనరల్ థీమ్, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయుల కృషి ఎనిమిది తొమ్మిదో తరగతి నుండి ఇద్దరు రెండు ప్రజెంటేషన్ ఒక పాఠశాల నుండి అనుమతించబడనని అన్నారు. బహుమతులుగా సర్టిఫికెట్, జ్ఞాపిక, నగదు అందజేస్తారని అన్నారు. 2023 గా ఉందన్నారు ప్రాథమిక స్థాయి పరీక్ష ఆన్లైన్లో 6 7 8 డిసెంబర్ 2023 తేదీలలో జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయి పోటీలు 20 డిసెంబర్ 2023న, రాష్ట్రస్థాయి పోటీలు 30 డిసెంబర్ 2023 న ఉంటాయన్నారు. పాఠశాల కోఆర్డినేటర్లు నవంబర్ 5వ తేదీ లోపు విద్యార్థుల పేర్లను బివిఎం ఏపీ సైట్ ద్వారా ఆన్లైన్లో నమోదు చేయాలని అన్నారు. రాష్ట్ర స్థాయి విజేతలకు బహుమతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ద్వారా అందజేయబడునని అన్నారు .పూర్తి వివరాలకు వెబ్సైట్లను సందర్శించగలరు అని తెలిపారు. సమాచారం కోసం జిల్లా కోఆర్డినేటర్ శ్రీమతి మధుమతి ఫోన్ నెంబర్ 8985541699జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ శ్రీ గోవింద నాగరాజు 9000574457 లను సంప్రదించవచ్చునని తెలిపారు ఈ కార్యక్రమంలోపి ఆర్ టి యు నాయకులు శ్రీనివాసరాజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా నాయకులు ఎం నరసింహులు  జిల్లా సైన్స్ ఆఫీసర్ ఓబుల్ రెడ్డి కౌశల్ పోస్టర్ కోఆర్డినేటర్ ఆంజనేయులు  బాబా ఫక్రుద్దీన్ శైలజ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

About Author