కేసీఆర్ ఆదిపురుష్ గా నిలిచారు !
1 min readపల్లెవెలుగువెబ్: కేసీఆర్ పార్టీని జాతీయ రాజకీయాల్లోకి ఆహ్వానిస్తూ పలువురు నేతలు ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ఇలాంటి సమయంలో నిత్యం వివాదాలతోనే దోస్తీ చేస్తున్న సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా కేసీఆర్ జాతీయ పార్టీపై హర్షం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మారుస్తూ కేసీఆర్ ప్రకటించిన మరుక్షణమే సోషల్ మీడియా వేదికగా రాంగోపాల్ వర్మ స్పందించారు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన కేసీఆర్ ఆదిపురుష్గా నిలిచారు. ఈ తరహా ప్రయోగం చేసిన తొలి నేతగా కేసీఆర్ నిలిచారని ఆయన పేర్కొన్నారు. అంతటితో ఆగని వర్మ… జాతీయ రాజకీయాల్లోకి కేసీఆర్కు స్వాగతం పలికారు.