PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

కేసీఆర్ బ‌యోపిక్ తీస్తా !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. త్వరలో సీఎం కేసీఆర్‌ బయోపిక్‌ తీస్తానని సినీ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ వెల్లడించారు. ఇందుకు స్ర్కిప్ట్‌ సిద్ధంగా ఉందని చెప్పారు. ఆయన దర్శత్వం వహించిన ‘డేంజరస్‌’ సినిమా ట్రైలర్‌ను గురువారం ఢిల్లీలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్‌ 8న ఈ సినిమా విడుదలవుతుందని, ఓటీటీ, థియేటర్లలో విడుదల చేస్తామని చెప్పారు. 40 రోజుల్లోనే డేంజరస్‌ సినిమాను తీశానని, ఎప్పుడూ క్రైమ్‌, థ్రిల్లర్‌ సినిమాలు తీస్తున్న తాను ఈసారి విభిన్నంగా ఈ సినిమాను రూపొందించానని చెప్పారు.

                                     

About Author