PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏపీలో కేసీఆర్ పుట్టిన రోజు వేడుక‌లు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఏపీలోని తూర్పు గోదావరి జిల్లా కడియం మండలం కడియపులంక తిరుమలశెట్టి వాసుకు చెందిన గ్రీన్‌ లైఫ్‌ నర్సరీలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన చిత్రాన్ని తీర్చిదిద్ది కేసీఆర్‌ పుట్టినరోజు వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ కరోనా సమయంలో మొక్కల ఎగుమతులు నిలిచిపోయి నర్సరీ రైతులు ఇబ్బందులు పడుతున్న వేళ సీఎం కేసీఆర్‌ కోటి మొక్కల మహాయజ్ఞం పేరుతో నర్సరీ రైతులను ఆదుకున్నందుకు కృతజ్ఞతతో ఆయన చిత్రాన్ని ఈ విధంగా తీర్చిదిద్దామన్నారు.

                                  

About Author