కేసీఆర్.. క్షమాపణ చెప్పాల్సిందే.. : రవి ప్రకాష్
1 min read– ఏపీ దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు బుజ్జివరపు రవి ప్రకాష్
పల్లెవెలుగు,ఏలూరు: భారతదేశానికి కొత్త రాజ్యాంగం తీసుకురావాలని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన దళిత సేన నాయకులు. భారతదేశానికి కొత్త రాజ్యాంగం కావాలని వ్యాఖ్యానించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ మాటలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన తీవ్రంగా ఖండించారు. శనివారం ఏలూరు నగరం పాత బస్టాండ్ వద్ద నున్న భారత రాజ్యాంగ పితామహుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలతో అలంకరించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ ,దళిత సేన రాష్ట్ర కార్యదర్శి షేక్ బాజీ ,దళిత సేన జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటూరు నవీన్ కుమార్ ,దళిత సేన జిల్లా అధికార ప్రతినిధి బేతపూడి నారాయణస్వామి ,దళిత సేన ఏలూరు నగర కార్యదర్శి జగన్, దళిత సేన నాయకులు కార్యకర్తలు, అనంతరం కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా దళిత సేన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు జిజ్జువరపు రవి ప్రకాష్ మాట్లాడుతూ కెసిఆర్ భారత దేశానికి కొత్త రాజ్యాంగం కావాలని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి మరియు కెసిఆర్ రెండుసార్లు ముఖ్యమంత్రి అవ్వడానికి భారత రాజ్యాంగం వల్లే అని గుర్తు చేశారు. కెసిఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భారత ప్రజానీకానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజానీకానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశార. కెసిఆర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పే అంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని దళిత సేన తరఫున హెచ్చరించారు.