NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

పీకే బృందంతో .. కేసీఆర్ భేటీ !

1 min read

పల్లెవెలుగు వెబ్​ :తెలంగాణ సీఎం కేసీఆర్ తో ప్రముఖ వ్యూహ‌క‌ర్త ప్రశాంత్ కిషోర్ బృందం భేటీ అయింది. రాష్ట్రంలోని కీల‌క ప‌రిణామాలు, రాజ‌కీయాలు, భ‌విష్యత్ నిర్ణయాల‌పై పీకే బృందంతో కేసీఆర్ చ‌ర్చించిన‌ట్టు తెలుస్తోంది.  ప్రగతిభవన్‌లో ఐ ప్యాక్‌కు చెందిన కీలక బృందంతో సమావేశమయ్యారు. ఈ భేటీలో ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించినట్టు సమాచారం. కాగా రాష్ట్రంలోని వివిధ వర్గాల స్పందన .. వివిధ కోణాల్లో తెలుసుకునేందుకు కేసీఆర్‌ ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, వివిధ సందర్భాల్లో ప్రభుత్వం తీసుకుంటున్న విధాన నిర్ణయాలపై ప్రజాభిప్రాయాన్ని సర్వేల ద్వారా సేకరించడంపై చర్చించినట్లు సమాచారం. కేసీఆర్ ఇప్పటి నుంచే సాధార‌ణ ఎన్నిక‌ల‌పై దృష్టిపెట్టిన‌ట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో బ‌హుముఖ పోటీ నెల‌కొన‌డం, ఇటీవ‌ల హుజురాబాద్ ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ ఓడిపోవ‌డం వంటి ప‌రిణామాల నేప‌థ్యంలో గ‌తానికి భిన్నంగా పీకే బృందంతో భేటీ అయిన‌ట్టు తెలుస్తోంది.

About Author