NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కేసీఆర్ రోజుకో మాట‌.. పూట‌కో పాట : టీజీ

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు రోజుకో మాట మాట్లాడుతున్నార‌ని రాయలసీమ హక్కుల ఐక్య వేదిక అధ్యక్షులు , బీజేపీ ఎంపీ టీజీ వెంక‌టేశ్ అన్నారు. కేవ‌లం హుజురాబాద్ ఉప ఎన్నిక కోస‌మే జ‌ల‌వివాదాన్ని తెర‌పైకి తీసుకొచ్చారని విమ‌ర్శించారు. శ్రీశైలం ప్రాజెక్టు కేవ‌లం విద్యుత్ ఉత్పత్తిక‌ని చెబుతున్న తెలంగాణ నేత‌లు.. ఇన్ని రోజులూ సాగునీటి కోసం ఎందుకు వాడుతున్నార‌ని విమ‌ర్శించారు. కేసీఆర్ ఆమోదంతోనే 2015లో రెండు రాష్ట్రాలు సంత‌కాలు చేశాయ‌ని గుర్తు చేశారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టులో 845 అడుగుల నీరు ఉంటే త‌ప్పా.. రాయ‌ల‌సీమ‌కు నీరు తీసుకెళ్లడం సాధ్యం కాద‌ని అన్నారు. నీటి విష‌యంలో ఏపీ నేత‌లంతా ఒకేతాటి పై ఉండాల‌ని కోరారు. ఒక‌టిరెండు రోజుల్లో రాయ‌లసీమ జ‌లాల‌పై నిర్ణయం తీసుకుంటామ‌ని తెలిపారు.

About Author