ప్రజలకు కేసీఆర్ హెచ్చరిక !
1 min read
పల్లెవెలుగువెబ్ : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ శనివారం అత్యవసర సమీక్ష చేపట్టారు. మొన్నటికంటే ఎక్కువ వరదలు వచ్చే ప్రమాదముందని తెలిపిన సీఎం.. అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోసారి ఎగువనుంచి గోదావరిలోకి భారీ వరద వచ్చే అవకాశం ఉందని, దీంతో గోదావరి పరివాహక జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలని చెప్పారు.