PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పులివెందుల‌లో కీచ‌క ఉపాధ్యాయుడు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : క‌డ‌ప జిల్లా పులివెందుల‌లో మూడవ తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ ఉపాధ్యాయుడు. అత‌ని పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, పోలీసులు అరెస్టు చేశారు. పులివెందుల మున్సిపాలిటీలోని ఓ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు శివశంకర్‌ కొన్ని రోజులుగా మూడవ తరగతి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. ఎవరూ లేని సమయంలో గదిలోకి పిలిపించుకొని వెకిలిచేష్టలు చేస్తున్నాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. విషయం పోలీస్ స్టేషన్‌కు చేరడంతో పోలీసులు శనివారం శివశంకర్‌ను అదుపులోకి తీసుకొని విచారించారు. వెంటనే శివశంకర్‌పై ఓ ఉపాధ్యాయురాలు చేయి చేసుకున్నట్లు తెలిసింది. శివశంకర్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని సీఐ భాస్కర్‌రెడ్డి చెప్పారు.

                                  

About Author