PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రభుత్వ పనులు ప్రారంభించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచండి..

1 min read

అధికారులకు కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఆదేశం..

చేబ్రోలులో జగనన్న ఇల్లు నిర్మాణాలు వేగవంతం చేసిన ఇంజనీరింగ్ అధికారులకు ప్రశంసా పత్రాలు

పల్లెవెలుగు వెబ్  ఏలూరు :  జిల్లాలో ప్రభుత్వ పనులు నిర్ణీత సమయంలో చేపట్టని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని జిల్లా కలెక్టర్ వె. .ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సోమవారం జిల్లాలో రోడ్లు, ప్రాధాన్యతా భవనాలు, జగనన్న ఇళ్ల నిర్మాణ ప్రగతిపై    సంబంధిత శాఖల ఇంజనీరింగ్  అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా రోడ్లు భవనాల శాఖ ద్వారా జాతీయ రహదారుల విభాగంలో 5 రోడ్ల నిర్మాణ పనులకు టెండర్లు పూర్తి అయి ఎల్.ఓ ఇచ్చిన 7 రోజులలోగా అగ్రిమెంట్ చేయవలసిన కాంట్రాక్టర్లు సంబంధింత శాఖాధికారులు ఎల్.ఓ ఇచ్చి   45 రోజులు పూర్తి కావస్తున్నప్పటికీ  ఇంకా అగ్రీమెంట్లు పూర్తిచేయకపోవడంపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంట్రాక్టర్లు  రోడ్లు పనులు పూర్తి చేయకపోవడంచేత ప్రజలకు  ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం కలిగే అవకాశం ఉందని, వెంటనే కాంట్రాక్టర్లకు నోటీసులు జారీ చేయాలని, నోటీసులకు స్పందించని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో ఉంచాలని కలెక్టర్ రోడ్లు భవనాల శాఖాధికారులను ఆదేశించారు.  అదేవిధంగా జిల్లాలో అధిక ప్రాధాన్యత గల రోడ్ల నిర్మాణ పనులను కూడా వేగవంతం చేయాలన్నారు. కొయ్యలగూడెం, రమణక్కపేట, అగిరిపల్లి, బొర్రంపాలెం లలో చేపట్టిన పీ.హెచ్.సి భవనాల నిర్మాణ పనులు కూడా వెంటనే పూర్తి చేయాలనీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.  ప్రాధాన్యతా భవనాల నిర్మాణాలను కూడా వెంటనే పూర్తి చేయాలనీ, పూర్తి చేసిన భవనాలను వెంటనే వినియోగంలోకి తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తా, అలసత్వం వహిస్తే కఠిన చర్యలు.. జగనన్న ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహించే సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు.  ప్రగతి పై సమీక్షిస్తూ  జగనన్న ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తున్నాదని , అటువంటి పధకాల అమలులో అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుని లక్ష్యసాధన పూర్తి చేయాలన్నారు. చిత్తశుద్ధితో పనిచేసే అధికారులు, సిబ్బందికి ప్రోత్సహిస్తానని, అదేసమయంలో   లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహించే సిబ్బంది పై చర్యలు తీసుకుంటానన్నారు.  జగనన్న ఇళ్ల నిర్మాణంలో అలసత్వం వహించే సిబ్బందికి  ఇంక్రిమెంట్ నిలిపివేయాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ సందర్భంగా ఇటీవల చేబ్రోలులో జగనన్న ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయడంలో ఉత్తమ సేవలు అందించిన గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్ అధికారులకు  ప్రశంసా పత్రాలను కలెక్టర్ అందజేశారు. సమావేశంలో గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ అధికారి విజయరాజు, డ్వామా పీడీ రాము, రోడ్లు భవనాల శాఖ, పంచాయతీ రాజ్, సూపెరింటెండెండింగ్ ఇంజనీర్లు, వివిధ శాఖల ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

About Author